Bindu Madhavi: బిందు మాధవి స్పీచ్ అదుర్స్..ట్రోఫి వారికి అంకితం ఇచ్చిన ఆడపులి

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ OTT విన్నర్ గా బిందు మాధవి గెలిచింది. మొదటి నుంచి హౌజ్ లో గేమ్ పట్ల ఫుల్ ఫోకస్ కనబరిచిన బిందు.. ప్రతీ టాస్క్ లో సత్తా చాటింది.

ఇక బిందు కు ఓటింగ్ పర్సంటేజీ కూడా హెవీగానే ఉంది. ఈ క్రమంలోనే చివరకు బిందు మాధవి టైటిల్ విన్ అయింది.

ఇక టైటిల్ గెలుచుకున్న తర్వాత బిందు మాధవి ఇచ్చిన స్పీచ్ చాలా డిఫరెంట్ గా ఉంది. తను గెలుచుకున్న ఈ ట్రోఫిని లేట్ బ్లూమర్స్ కు అంకితం ఇస్తున్నట్లు తెలిపింది. లేట్ బ్లూమర్స్ కు అంకితం ఇవ్వడానికి గల కారణాలను కూడా వివరించింది. తాను కూడా లేట్ బ్లూమర్ నేనని, చాలా ఆలస్యంగా జీవితంలో సక్సెస్ ను అందుకున్నానని, కానీ, ఆనందంగా ఉన్నానని తెలిపింది.

ఈ క్రమంలోనే ఎంచుకున్న రంగంలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాలని సూచించిన బిందు మాధవి…తనను ప్రేక్షకులకు, ఓటేయని వారికీ ధన్యవాదాలు చెప్పింది. టైటిల్ విన్ అయిన తర్వాత బిందు మాధవి భావోద్వేగానికి గురయింది.ఈ క్రమంలోనే తాను తొలుత బిగ్ బాస్ తెలుగు షోకు రావడానికి హెజిటేట్ చేశానని, కానీ, వచ్చాక తెలుగు సినిమాల్లో రాణించాలని అనుకున్నానని జెన్యూన్ సమాధానాలు చెప్పింది బిందు.తమిళ్ బిగ్ బాస్, సినిమాలు అక్కడి ఆడియన్స్ కు తనను దగ్గర చేశాయని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news