జియా ఖాన్ సూసైడ్ కేసులో నిర్దోషిగా సూరజ్ పంచోలి

-

బాలీవుడ్​ నటి జియా ఖాన్‌ మృతి కేసులో ముంబయి సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో బీ టౌన్ హీరో సూరజ్‌ పంచోలీని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. జియాను ఆత్మహత్య చేసుకోవడానికి సూరజ్ ప్రేరేపించడానడానికి సాక్ష్యాధారాల లేనందున సూరజ్‌ను నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. 2013, జూన్‌ 3వ తేదీన ముంబై జూహూలోని తన ఇంట్లో జియాఖాన్‌(25) విగతజీవిగా కనిపించింది. ఘటనా స్థలంలో దొరికిన ఆరు పేజీల లేఖ ఆధారంగా.. జూన్‌ 10వ తేదీన ముంబయి పోలీసులు నటుడు సూరజ్‌ పంచోలిని ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంతో(ఐపీసీ సెక్షన్‌ 306 ప్రకారం) అరెస్ట్‌ చేశారు.

ఆదిత్య పంచోలీ తనయుడైన సూరజ్‌ పంచోలీ, జియాతో డేటింగ్‌ చేశాడనే ప్రచారం ఉంది. 2012 సెప్టెంబర్‌ నుంచి వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని టాక్. జియా ఖాన్‌ తల్లి రబియా ఖాన్‌ మాత్రం తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని వాదిస్తోంది. జియాను శారీరకంగా, మానసికంగా సూరజ్‌ హింసించాడని, ఫలితంగా నరకం అనుభవించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది.

2013 అక్టోబర్‌లో రబియా, జియాఖాన్‌ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

2014 జులైలో ఈ కేసను సీబీఐ టేకప్ చేసింది. విచారణ తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ కేసును 2021లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేసింది ముంబయి సెషన్స్‌ కోర్టు. ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్‌ విచారణ చేపట్టింది. గత వారం సీబీఐ స్పెషల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వడంతో ఇవాళ తుది తీర్పును వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news