వందశాతం సీట్లకి కేంద్రం నో.. తమిళనాడు ప్రభుత్వానికి షాక్..

-

మహమ్మారి వల్ల సినిమా థియేటర్లకి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. బార్లు, రెస్టారెంట్లతో సహా ఫంక్షన్ హాల్స్ అన్నింటికీ అనుమతులిచ్చిన ప్రభుత్వం స్కూళ్ళు, థియేటర్లకి మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టింది. స్కూళ్ళ గురించి వదిలేస్తే, యాభైశాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లని నడిపించలేక చాలా చోట్ల థియేటర్లు పూర్తిగా మూసివేసిన సందర్భాలు కూడా కనిపించాయి. ఐతే ప్రస్తుతం సంక్రాంతి దగ్గర పడుతుంది. ఎన్నో సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం థియేటర్లలో వందశాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతులు ఇచ్చింది. దాంతో సినిమా అభిమానులందరూ సంతోషించారు. ఐతే కేంద్ర నియమాలు అమల్లో ఉన్నప్పుడు వందశాతం సీటింగ్ కి ఎలా అనుమతులు ఇస్తారంటూ తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. జనవరి 31వ తేదీ వరకు యాభైశాతం సీటింగ్ తోనే థియేటర్లు నడవాలని, దాన్ని లెక్క చేయకుండా వందశాతం సీటింగ్ కెపాసిటీతో నడిపించకూడదని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news