సినిమా వాళ్ల పొట్టమీద కొట్టి భయపెట్టారు.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

-

సినిమా వాళ్ల పొట్టమీద కొట్టి భయపెట్టారని.. నిన్న జరిగింది చూస్తే ఇలా కూడా చేయవచ్చా అని అనిపించిందని సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నేను 40 క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీ మినిష్టర్ ని ఆతరువాత 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశానని.. నిన్ని మొన్న ఫిలిం ఇండస్ట్రీలో సమస్యను తీసుకువచ్చి ఆసమస్యను పరిష్కారం చేస్తామనే నెపంతో ఏ విధంగా ఆడుకుంటారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదని… ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అన్నారు.chandrababu naidu ys jagan

 ఫిలిం ఇండస్ట్రీలో సినిమా వాళ్లు వాళ్ల పనులు చేసుకుంటారు. అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో జగన్ సమస్యలు తీసుకువచ్చి.. ఒక కక్షతో చేశారని ఆరోపించారు. నేను ఇలాంటివి ఊహించలేదని.. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసినా.. ఇవన్నీ తెలియవని, ఇప్పుడు నేర్చకుంటున్నానని అన్నారు. పెద్ద గొప్ప నాయకుడా.. జగన్ అంటూ ఫైర్ అయ్యారు. ఏ విధంగా పొట్ట మీద కొట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడో.. ఇదే పరిస్థితులు సామాన్య ప్రజలకు ఉన్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...