శివాజి కథతోనే మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. అయితే జక్కన్న సినిమాకు కొద్దిగా టైం పట్టేలా ఉందని ఈ గ్యాప్ లో త్రివిక్రంతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్లగానే మహేష్ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఇక రాజమౌళితో మహేష్ చేసే సినిమాపై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే కథ ఇదే అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పుకుంటున్నారు.

Chatrapathi Shivaji Story for Mahesh Rajamouli movie

లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం మహేష్, రాజమౌళి కూడా పిరియాడికల్ మూవీనే చేస్తారని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటున్న ఛత్రపతి శివాజి కథతోనే మహేష్ సినిమా ఉంటుందని టాక్. రాజమౌళి ఇప్పటికే తన టీం తో డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి డైరక్షన్ లో మహేష్ హీరోగా శివాజి కథ తెరకెక్కిస్తే మాత్రం ఆ సినిమా మరో సంచలనం గా మారుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాపై పూర్తి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.