మహేష్ బాబు..శక్తిని, సక్సెస్ ఇవ్వాలి – చిరంజీవి ట్వీట్

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు అటు హీరో గానే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఎంతో మంది అభిమానులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇతరులకు సహాయం చేయడంలో ఎంత హుందాగా అయితే ఉంటాడో తన ఫ్యాన్స్ కూడా అంతే హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు.

సినిమా నచ్చితే జై కొడతారు లేదంటే సైలెంట్ గా ఉండిపోతారు. అయితే.. ఇవాళ మహేష్‌ బాబు బర్త్‌ డే. ఈ నేపథ్యంలోనే మహేష్‌ బాబుకు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని, సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు కుంటూ మహేష్‌ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి.