బుల్లితెరపై.. కమెడియన్ ఆలీ తీసుకొనే రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించడమే కాకుండా మరెన్నో సినిమాలలో హీరోగా కూడా నటించారు. ఇకపోతే హీరోగా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆలీ ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే సెలబ్రిటీ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించడమే కాకుండా వారికి సంబంధించిన అలాగే వ్యక్తిగత సినిమా విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది కనుమరుగైన హీరోలను కూడా ఈ షో ద్వారా ఆహ్వానించి వారి విషయాలను ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ షో కి అలీ ఎంత పారితోషకం తీసుకుంటారు అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.6.50 లక్షలు పారితోషకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఆలీ ఇలా ఒక్కో ఎపిసోడ్ కు ఇంత పారితోషకం తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్స్లు పోగా తన పర్సనల్ స్టాప్ కి ఖర్చులు ఇవ్వగా రూ.5 లక్షలకు కాస్త అటు ఇటుగా ఈయనకు మిగులుతుందట. ఇక నెలలో మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే ఆలీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.

Alitho Saradaga: 'అలీతో సరదాగా' షోలో అసలు రహస్యాలు.. గెస్టులకు ఎన్ని డబ్బులిస్తారంటే..? | Interesting details and facts about ETV talk show Alitho Saradaga hosted by Comedian Ali pk– News18 Telugu
ఇక దీని ప్రకారం చూసుకుంటే .. ఈ కార్యక్రమం ద్వారా నెలకు రూ. 20 లక్షల వరకు ఆలీ సంపాదిస్తున్నారు. ఇది సామాన్యులకు చాలా పెద్ద అమౌంట్ అని చెప్పవచ్చు. కానీ ఆలి అంటే స్టార్స్ కు ఇది చిన్న అమౌంట్ అయినా కూడా తనకు సెల్ఫ్ సంతృప్తి కావాలనే ఉద్దేశంతో ఆలీ తన సరదా కోసం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలుపుతూ. సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం మరింతకాలం కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.