అనిల్ రావిపూడి అదిరిపోయే ప్లాన్..NBK 108లో విలన్‌గా రాజశేఖర్..

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రజెంట్ F3 ఫిల్మ్ సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. తన తర్వాత సినిమా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్యతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు అనిల్.

NBK 108గా వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా ప్రియమణిని, బాలయ్య కూతురిగా శ్రీలలను అనిల్ రావిపూడి ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్ ఓటీటీ’ టైటిల్ విన్నర్ బిందు మాధవికి చిత్రంలో కీలక పాత్ర ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇకపోతే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన నేపథ్యంలో ఫైట్ సీన్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టాలని అనిల్ రావిపూడి డిసైడ్ అయ్యారట. విలన్ గా టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ను ఒప్పించాడని సమాచారం.

గతంలో రాజశేఖర్ సైతం తాను బాలయ్య సినిమాలో విలన్ గా చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవల NBK 108 స్టోరి వినిపించి..విలన్ గా నటించాలని దర్శకుడు అనిల్ రావిపూడి రాజశేఖర్ ను కోరారట. రాజశేఖర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 ఫిల్మ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news