‘పుష్ప-2’లో ఊహించని సర్‌ప్రైజ్..కీలక పాత్రలో విజయ్ సేతుపతి?

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్..‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ ప్లస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ‘పుష్ప’ రాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ ప్రజానీకం…ఈ సినిమా చూసి సర్ ప్రైజ్ అయింది.

బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ‘పుష్ప’ పిక్చర్ చూసి వావ్ అన్నారు. సుకుమార్-బన్నీలు వెండితెరపై మ్యాజిక్ చేశారని తెగ కొనియాడారు. ఇప్పటికీ ‘పుష్ప’ మేనియా ఇంకా కొనసా..గుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మేకర్స్ పుష్ప-2 కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో అనగా ‘పుష్ప’రాజ్ ..సీక్వెల్ లో.. ఎవరూ ఊహించని సర్ ప్రైజెస్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సీక్వెల్ లో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. మాలీవుడ్(మలయాళం) స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ..‘భన్వర్ సింగ్ షెకావత్’గా అత్యద్భుతమైన నటన కనబర్చారు. ఇక సెకండ పార్ట్ ‘పుష్ప: ది రూల్’లో ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ తో పాటు సర్ ప్రైజ్ ప్యాకేజీగా విజయ్ సేతుపతిగా వస్తారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news