దగ్గుబాటి అభిరామ్ కార్ యాక్సిడెంటా…లేదంటున్న ఫ్యామిలీ !

-

నిన్న దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం లేదని దగ్గుబాటి ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. అసలు అది ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని ఎందుకు అభిరామ్ పేరు వచ్చిందో తెలియదని వారు పేర్కొన్నారు.

నిజానికి నిన్న రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లోని పంచవటి కాలనీలో ద‌గ్గుబాటి అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంద‌నీ, ఎదురుగా వ‌స్తున్న కారును ఆయ‌న కారు ఢీకొట్టింద‌నీ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఈ నేపదంలో ఈ ప్రచారాన్ని అభిరామ్ కుటుంబ‌స‌భ్యులు ఖండించారు. అసలు మీడియాలో చూపిస్తున్న కారుకు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇక ఈయన శ్రీ రెడ్డి లైంగిక వేధింపుల తరువాత లైం లైట్ లోకి వచ్చాడు. రానా లానే ఈయన కూడా హీరో అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news