Dasara movie: గోదావరిఖని లో సందడి చేసిన నాని -కీర్తి సురేష్..

-

గోదావరిఖని లో సందడి చేశారు “దసరా” టీం.నాచురల్ స్టార్ నాని ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.కృతి శెట్టి, సాయి పల్లవి, నాని ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది.తాజాగా నాని “దసరా” సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.

జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, భాషల్లో విడుదల కానుంది.నానీ కి తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరుగుతుంది.ఈ చిత్రంలో  భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ చిత్రం లో” నాటు ఫుల్” పాటలో సంచలన స్టెప్స్ అందించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.దాదాపు 500 మంది డ్యాన్సర్లతొ ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

 

ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై ” దసరా”ను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.నాని ఫుల్ లెంత్ మాస్ యాక్షన్-ప్యాక్ద్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ చిత్రం గోదావరిఖని లోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో జరుగుతుంది.ఇటీవలే విడుదలైన “దసరా” గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news