అక్బరుద్దీన్ విద్వేష వ్యాఖ్యలు కేసులో నేడు నాంపల్లి కోర్ట్ తీర్పు

-

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసు విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ముగిసింది. తాజాగా మంగళవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్ట్ ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 2013లో నిర్మల్ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్ధీన్ నిందితుడిగా ఉన్నారు. ఆసమయంలో ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అప్పట్లో పోలీసులు కేసు పెట్టారు. ఈకేసుపై చాలా సార్లు విచారణ జరిగింది. తాజాగా ఈరోజు తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్ట్. నిజామాబాద్, నిర్మల్ పట్టణాల్లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మా తడాఖా చూపిస్తాం అంటూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. 

ఈకేసులో ఇప్పటి వరకు 30 మందికి పైగా సాక్షులను విచారించారు. నిజామాబాద్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ కేసును విచారించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ లాబోరేటరీ, చంఢీగడ్ అక్బరుద్దీన్ వాయిస్ పై నివేదిక ఇచ్చింది. అక్బరుద్దీన్ వాయిస్ సరిపోతుందని కేసు ఛార్జీషీట్ లో పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 153-A ( మతాల మధ్య శత్వుత్వం పెంచడం) , 295-A ( ఇతర మతాలను అవమానించడం, విశ్వాసాలను దెబ్బతీయడం) కింద అక్బరుద్దీన్ పై కేసులు నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news