కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఆయన నటించిన సినిమాలు విడుదలై ఘన విజయం సాధిస్తున్నాయి. కాగా, ఆ హీరో ఆఫీసులో వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది.
చెన్నై శివారు ప్రాంతమైన పనైయూర్లో విజయ్ కి ఓ ఆఫీసు ఉంది. ఆ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో ఓ మృతదేహం లభించడంతో కలకలం రేగింది. విజయ్ కు ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ అనే రాజకీయ పార్టీ ఉంది. పనైయూర్‌లోని ఓ భవనం నుంచి ఆ పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఆ బంగ్లాను ఆధునికీకరిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా ప్రభాకరన్ అనే వ్యక్తి అక్కడ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
అతడు కొద్ది రోజుల కిందట తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లాడు. ఇటీవల తిరిగి వచ్చిన అతను పరోటా కొనుక్కొవడానికి రూ.100 ఇవ్వాలని సూపర్ వైజర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఏమైందో తెలియదు కానీ ప్రభాకరన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి చేతిలో, నోట్లో పరోట ఉండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంతో ‘తలపతి 66’ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇందులో భారీ తారాగణమే ఉంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.