టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా..సామాజిక అంశాలపైన సినిమాలు తీస్తుంటారు. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరిస్తుంటారు. అలా ఆయన తీసిన సినిమా ‘రిపబ్లిక్’. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇందులో కలెక్టర్ అభిరామ్ గా నటించారు. కాగా, ఈ చిత్రంలోని కలెక్టర్ పాత్రను ‘జనగణమన’ సినిమాతో పోలుస్తూ డైరెక్టర్ దేవకట్టా ట్వీట్ చేశారు.
దర్శకుడు దేవకట్టా తన సినిమా ‘రిపబ్లిక్’ ను ‘జనగణమన’ సినిమాతో పోల్చారు. అయితే, ఆ ‘జనగణమన’ ఫిల్మ్..టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కాదు.. మాలీవుడ్ (మలయాళ) మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్-డిజో కాంబోలో తెరకెక్కిన ‘జనగణమన’. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలైంది.
వ్యవస్థలో పేరుకుపోయిన పరిస్థితులను ప్రశ్నిస్తూ తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. తాజాగా ఈ సినిమాను చూసిన దేవకట్టా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘జనగణమన’లో చక్కటి సందేశముందని, అది తన ‘రిపబ్లిక్’ సినిమాలోని కలెక్టర్ అభిరామ్ థీమాటిక్ లైన్ “అన్యాయం జరిగిన ప్రతి సారి ప్రజలు, మీడియా పోలీసులు, న్యాయస్థానాలైతే దాన్ని వ్యవస్థ అనరు!!” అనే దానితో లింక్ అయి ఉందని తెలిపారు. దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ, హీరో పృథ్వీరాజ్ సుకుమార్ లను అభినందించారు.
#JanaGanaMana beautifully elaborates on one of Collector Abhiram’s thematic lines in #REPUBLIC ; “అన్యాయం జరిగిన ప్రతి సారి ప్రజలు, మీడియా పోలీసులు, న్యాయస్థానాలైతే దాన్ని వ్యవస్థ అనరు!!” Kudos to @PrithviOfficial and @DijoJoseAntony for this excellent piece of work!🙏 (2/2)
— deva katta (@devakatta) June 4, 2022