ఆ ఒక్క సినిమా రకుల్ లైఫ్ ను మార్చేసిందా..?

-

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్ హీరో, స్టార్ హీరో ల సినిమాలలో అవకాశం వస్తే చాలు కథ పాత్ర గురించి పట్టించుకోకుండా ఆ సినిమాలకు ఓకే చెప్పేస్తున్నారు. అయితే అలా కథ పాత్రలను పట్టించుకోకుండా సినిమాలను ఎంచుకున్న హీరోయిన్లు ఆ తర్వాత రోజుల్లో ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోని ప్రముఖ యంగ్ బ్యూటీ కృతి శెట్టి హవా కూడా తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మలా మరొక హీరోయిన్ కెరియర్ కూడా నాశనం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు కొన్నేళ్ళ క్రితం నటిగా ఒక వెలుగు వెలుగిన రకుల్ ప్రీతిసింగ్.

అయితే సినిమాల ఎంపికలో చేసిన తప్పుల వల్ల ఆమె ఆఫర్లను కోల్పోయారు. రకుల్ నటించిన సినిమాలలో స్పైడర్ సినిమా ఒకటి. ఈ సినిమాలో రకుల్ రోల్ కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఈ సినిమాలో లుక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా ఉండవు. ఈ సినిమా ఈమెకు మైనస్ అయిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమా వల్లే ఆమెకు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి ఆ తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలేవి కూడా ఈమెకు రాలేదు. వాస్తవానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు జోడిగా నటించిన సినిమాలలోని పాత్రలు ఈమెకు మంచి కమర్షియల్ హిట్టును అందించాయి.

కానీ స్పైడర్ సినిమా ఫ్లాప్ అవడంతో దర్శక నిర్మాతలు కూడా ఈమెకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. చివరిగా కొండ పొలం సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ఈమెకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. అందుకే బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె ఇప్పటికైనా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే.. టాలీవుడ్లో మళ్లీ పూర్వ వైభవాన్ని పొందే అవకాశాలు ఉంటాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news