తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు చిరంజీవి.. ఇక కేవలం తన నటనతో.. ప్రతిభతో మాత్రమే కాకుండా పెద్దల వద్ద ఎలా అనుకువుగా బతకాలి అనే విషయాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు కాబట్టి.. నేడు రాష్ట్రం గర్వించదగ్గ నటుడిగా చలామణి అవుతున్నారు. ఇక చిరంజీవి ఎన్నోరకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ.. సినీ పరిశ్రమలో ఎలాంటి నష్టం వచ్చినా సరే అండగా నేనున్నాను అంటూ కార్మికుల నష్టం కష్టం తీరుస్తూ ఉంటాడు. ఇక రాజకీయం విభాగానికి వస్తే ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి 18 సీట్లను కైవసం చేసుకున్న ఆయన తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.ఇకపోతే చిరంజీవి కూడా హీరో కాకముందు ఆ స్టార్ హీరోకు పెద్ద అభిమాని అట.. అంతే కాదు ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ కు అధ్యక్షత బాధ్యత కూడా వహించాడు. ఇకపోతే ఎవరా స్టార్ హీరో అనే విషయానికి వస్తే ఆయన ఎవరో కాదు ఈస్ట్ మన్ కలర్ ను తెలుగు తెరకు పరిచయం చేసి సరికొత్త టెక్నాలజీని తెలుగు ప్రజలకు చూపించి.. హాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను మైమరపింప చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి మొదటి అభిమాని.. కృష్ణ ను విపరీతంగా అభిమానించేవారు ..అంటే చిరంజీవి సినిమాల్లోకి రావడానికి కూడా కృష్ణ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. చిరంజీవి యువత గా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు ప్రేక్షకులలో విపరీతమైన అభిమానం ఉండేది. అంతే కాదు ఆయనకి అభిమానుల సంఘం కూడా ఏర్పాటు చేశారు. అభిమాన సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా రాజకీయ రంగప్రవేశం చేసి కూడా అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.