శ్రీదేవి తో ఉన్న ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ అని మీకు తెలుసా..?

అతిలోక సుందరి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తిరుగులేని మహారాణిలా చక్రం తిప్పింది. ఇక ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించి.. మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీదేవి.. ఆ తర్వాత దుబాయ్ కి వెళ్లి అక్కడ అనుకోని పరిస్థితుల్లో బాత్ రూమ్ లోనే మరణించింది.. ఇకపోతే ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇకపోతే శ్రీదేవి కి సంబంధించిన ఒక ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శ్రీదేవితో కలిసి ఉన్న ఈ ముగ్గురు చిన్నారులు కూడా గతంలో స్టార్ హీరోయిన్ లుగా ఒక వెలుగు వెలిగిన వారే.

ఇక మరి ఆ పిల్లలు ఎవరు అనే విషయానికి వస్తే.. వారెవరో కాదు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన సొంత అక్కాచెల్లెలు.. నగ్మా, జ్యోతిక , రోషిణి.. ఇక ఈ ముగ్గురు గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

జ్యోతిక:

దక్షిణ సినీ ఇండస్ట్రీలో తెలుగు , తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో సూర్య ను వివాహం చేసుకుంది. మొదటిసారి షాక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన జ్యోతిక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది . సూర్య నటించిన చాలా సినిమాలకు ఈమె నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే.. మరొకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ చాలా బిజీగా ఉంది జ్యోతిక.

రోషిణి:

ఈమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో చిరంజీవి సరసన మాస్టారు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరమై.. అమెరికాలో ఒక వ్యాపార వేత్త ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయినట్లు సమాచారం.

నగ్మ:

ఇక స్టార్ హీరోయిన్ నగ్మా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈమె అప్పట్లో కుర్రకారుకు కలల రాకుమారిగా మిగిలిపోయింది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ ki ఎదిగిన నగ్మా వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ ..చివరికి ఏ ఒక్కరిని కూడా వివాహం చేసుకోకుండా ఐదు పదుల వయసులో కూడా వివాహానికి దూరంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.