భారత దేశంలో చెరకు వాణిజ్య పంట..ఈ పంటను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తిలను చేస్తారు. ఈ పంట అధిక దిగుబడి తో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
చెరకు పంటకు అనువైన రకాలు..
ఆలస్యంగా పక్వానికి వచ్చే రకాలు (12 -13 నెలలు): Co 7219, Co7706, Co8011, CoR8001.
మధ్య-ఆలస్య పరిపక్వ రకాలు (11-12 నెలలు) : CoA7602, CoT8201, Co7805, Co8021, 85R186, 86A146, 87A 397, 83V15, 83V288.
ప్రారంభ పరిపక్వ రకాలు (9 -10 నెలలు) : Co6907, Co7505, 90A 272, 81A99, 82A123, 83A145,
అనుకూల వాతావరణం..
అధిక వర్షపాతం, నీటి పారుదల ఎక్కువగా ఉండి,నల్ల రేగడి నేలలు బెస్ట్..నీటి యద్దడి బాగుంటే గడ బాగుంటుంది.వెచ్చగా ఉండే పెరుగుతున్న కాలం, స్పష్టమైన ఆకాశం, చల్లని రాత్రులు, వర్షపాతం లేని పొడి వాతావరణం, చక్కెరను నిర్మించడానికి పగలు, రాత్రి ఉష్ణోగ్రతలలో అధిక వ్యత్యాసం అవసరం. చెరకు పెరుగుదల కు 24, 30o C ఉష్ణోగ్రత అవసరం. భారతదేశంలో, 600 నుండి 3000 మి.మీ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరుగుతుంది, పెరుగుదల కాలంలో వర్షాలు, వేగవంతమైన చెరకు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పక్వానికి వచ్చే సమయంలో వర్షాలు, పేలవమైన రసం నాణ్యతకు దారితీస్తాయి. ఏపుగా పెరిగే సమయంలో అధిక తేమతో పాటు వెచ్చని వాతావరణం అవసరం, 45 నుండి 65% తేమ + పరిమిత నీటి సరఫరా పండే దశలో ఉండాలి. అధిక సూర్యరశ్మి గంటలు బాగుండేలా చేస్తుంది.. అధిక దిగుబడిని అందిస్తుంది.