ఆటలో అరటి పండు లా హరీశ్ శంకర్ పరిస్థితి..!

దర్శకుడు హరీశ్ శంకర్ తన చివరి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటినా కూడా ఇంకో సినిమా చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ తో  భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి హరీష్ శంకర్ చాలా రోజుల గా ఎదురు చూస్తున్నాడు.కాని ప్రస్తుతం పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా సరిగా లేదు. కొన్ని రోజులు షూటింగ్ కోసం కొన్ని రోజులు రాజకీయాల కోసం సర్దుబాటు చేస్తూ వస్తున్నాడు.

పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భవదీయుడు భగత్ సింగ్’పై ఎలాంటి అప్ డేట్ రావడంలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వున్నట్టా లేనట్టా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా జరిగిన ఓ ఆడియో వేడుకలో పాల్గొన్న హరీశ్ శంకర్ తనని విపరీతంగా పొగిడే సరికి, నేను ఏమి పుల్ జోష్ లో లేను మూడేళ్ల గా సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాను అని తన మీద తానే పంచ్ కూడా  వేసుకున్నాడు.

ఇక ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి షెడ్యూల్  రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకొన్ని రోజులలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న హరీష్ శంకర్  ఆశలు ఆవిరయ్యే న్యూస్ బయటకు వచ్చింది. ఎందుకంటే  పవన్ కల్యాణ్  హరీశ్ శంకర్ కు కాకుండా `సాహో` ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని కోరినట్లు గా తెలుస్తోంది. దీనితో హరీశ్ శంకర్ ఫ్యాన్స్ చాలా నిరూస్తాహం కు గురి అయ్యారు.