ఒక ఇంటివాడైన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఫోటోలు వైరల్..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం దసరా.. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రూ. 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పటివరకు నాని ఇలా కనబడలేదని.. ఊరమాస్ లుక్ లో ఆయన కనిపించి అందరినీ అలరించారు.

నానిని మొదటిసారి ఇలా చూపించినందుకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ను కూడా ప్రతి ఒక్కరు అభినందించారు. ఇకపోతే ఇది అతనికి మొదటి అవకాశమే అయినా.. తన మొదటి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఇక నాని కూడా డైరెక్టర్ని పొగుడుతూ రావడం జరిగింది ఇకపోతే తాజాగా దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్నాడు. గోదావరి ఖనిలోని సౌమ్యకృష్ణ అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ ఫోటోను నాని షేర్ చేస్తూ మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు.. మీరు అందరూ ఆశీర్వదించండి అంటూ పోస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో చాలా వైరల్ గా మారుతోంది. తెలంగాణ గోదావరి ఖని కి చెందిన శ్రీకాంత్ సినీ పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సుకుమార్ దగ్గర ఎక్కువ కాలం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెలకువలు నేర్చుకున్నాడు. ఇక మొదటి సినిమా నానితో దసరా తీసి సూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. మొత్తానికి అయితే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడమే కాదు ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించారని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news