మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నామ మాత్రపు షరతులతో కూడిన బెయిలు మంజూరుపై సీబీఐ తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, వైఎస్ సునీతకు సలహాలు ఇచ్చారు ఎంపీ రఘురామ. న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే 10 రోజుల జైలు శిక్షను విధించే విధంగా తాజాగా సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించిందని వెల్లడించారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అనరాని మాటలు అన్నారని, అజయ్ కల్లాం గారి చేత కూడా అనిపించారని, అప్పటి న్యాయమూర్తి ఎన్వి రమణ గారిపై పలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి సంతకంతో కూడిన పత్రికా ప్రకటనను మీడియాకు విడుదల చేయడం జరిగిందని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నేరుగా జస్టిస్ ఎన్వి రమణ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు లేఖను రాశారని, జగన్ మోహన్ రెడ్డి గారితో సహా అప్పటి న్యాయమూర్తి ఎన్వి రమణ గారిపై విమర్శలు చేసిన అందరిపై సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో చర్యలు తీసుకోవాలని అన్నారు. తాను ఎప్పుడూ న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు…చేయనని అన్నారు.