సమంత చేసిన ఫస్ట్ యాడ్ ఏదో తెలుసా..వీడియో వైరల్..!!

ఫిలిం ఇండస్ట్రీ.. అనే రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లలు అయితే నేరుగా సినిమాలలో హీరో , హీరోయిన్లుగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. కానీ మరి కొంతమంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు మొదట మోడల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెరపై సీరియల్స్, ఆ తరువాత కొన్ని వాణిజ్య ప్రకటనలకు పని చేస్తూ అక్కడ పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత హీరో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇకపోతే వీరు ఈ స్థానానికి చేరుకోవడం కోసం ఎంత కష్టపడి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.Actress Samantha Brand Ambassador | Lux Soap Ad | Commercial Endorsement Deal - Filmibeat

అలాంటి వారిలో ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఒకరు . ఒకప్పుడు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ప్రస్తుతం దేశం గర్వించదగ్గ పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవడం అంటే అంత ఆషామాషీ కాదు. ఇక సమంత మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందు పలు వాణిజ్య ప్రకటన లు కూడా పని చేసింది. ఇక సమంత కేరళ రాష్ట్రంలో పుట్టినప్పటికీ తన తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది. ఇక అక్కడే ఆమె డిగ్రీ చదువుతున్న రోజుల్లో నటన మీద ఆసక్తితో కాలేజీ లో పలు కల్చరల్ ఈవెంట్స్ కి పాల్గొంటూ చాలా చురుకుగా పాల్గొనేది. ఇక ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఆషిక జ్యువలరీ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తీసిన ఒక యాడ్ లో నటించే అవకాశం రాగా..పాకెట్ మనీ కోసం ఈ యాడ్లో నటించింది సమంత.

ఇక ఈ యాడ్లో నటించినందుకు గాను అప్పట్లోనే సమంతకు ఐదు వేల రూపాయల పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఈ యాడ్ లో సమంతని చూసి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో అంటూ ప్రతి ఒక్కరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు