వేణు తొట్టెంపూడి, బాలయ్య మధ్య ఉన్న బంధుత్వమిదే..!

-

టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి..ఇటీవల విడుదలైన మాస్ మహారాజ రవితేజ ‘రామారావు..ఆన్ డ్యూటీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ‘సీఐ మురళి’గా వేణు తొట్టెంపూడి నటించారు. వేణు నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. కానీ, సినిమానే అనుకున్న స్థాయిలో లేదు. అయితే, ఈ పిక్చర్ ద్వారా వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి తన వ్యాపార పనుల్లో బిజీగా ఉన్న వేణు తొట్టెంపూడి ..‘రామారావు…ఆన్ డ్యూటీ’తో రీ ఎంట్రీ ఇచ్చారు. త్వరలో ‘చాయ్ బిస్కట్’ వారి నిర్మాణ సారథ్యంలో వెబ్ సిరీస్ చేయనున్నారు. ‘స్వయం వరం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన వేణు తొట్టెంపూడి సహజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

వెండితెరపైన వేణు తొట్టెంపూడి కనబడితే చాలు..ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. తనదైన నటనతో నవ్వించడమే కాదు..ఎమోషనల్ సీన్స్ చేసి కంటతడి కూడా పెట్టించగలరు వేణు తొట్టెంపూడి. వేణు తొట్టెంపూడి సినీ హిస్టరీ గురించి చాలా మందికి తెలుసు. కానీ, ఆయన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

వేణు తొట్టెంపూడి బంధువుల్లో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. తెలంగాణలోని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వేణు తొట్టెంపూడి బావ..ఈయన టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకుడిగా ఉన్నారు. వేణు సోదరి నామా నాగేశ్వరరావు భార్య.

ఇక ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ వేణు తొట్టెంపూడి మేనమామ. మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వేణు తొట్టెంపూడి పెదనాన్న. సాంబశివరావు మనవడు మెతుకు మిల్లి శ్రీ భరత్..బాలయ్య చిన్న కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆ లెక్కన బాలయ్య వేణుకు వరుసకు అన్నయ్య అవుతారు. అదీ బాలయ్య, వేణు తొట్టెంపూడికి మధ్య ఉన్న బంధుత్వం. వేణు తొట్టెంపూడి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news