టిక్ టాక్ దుర్గారావు నెల సంపాదన ఎంతో మీకు తెలుసా?

-

సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ స్టేటస్ పొందుతున్నారు. అలా సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్నవారు టిక్ టాక్ దుర్గారావు దంపతులు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ సోషల్ మీడియలో వీరి హల్ చల్ మాత్రం తగ్గలేదు. దాంతో వీరు అనతి కాలంలోనే సెలబ్రిటీలు అయిపోయారు.

tik tok durgarao
tik tok durgarao

‘పలాస’ చిత్రంలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాటకు వీళ్లు వేసిన స్టెప్పులు చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే బుల్లితెర మీద పలు కార్యక్రమాల్లో పాల్గొని వీరు ఇంకా ఫేమస్ అయిపోయారు. వీరికి సినిమాల్లోనూ అవకాశాలొచ్చాయి. దుర్గారావు ఇప్పటికే పలు సినిమాల్లో నటుడిగా కనిపించారు.

‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ లోనూ స్కిట్ చేసిన ఈ దంపతులు.. యూట్యూబ్ చానల్ లో నూ సందడి చేస్తున్నారు. గతంలో దుర్గారావు బట్టలు నేసి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ, టిక్ టాక్..ఆ తర్వాత యూట్యూబ్ వలన డిజిటల్ గా ఫేమస్ అయిపోయి చక్కటి అవకాశాలు వచ్చాయి. అలా ఇప్పుడు ఓ వైపు బుల్లితెరపైన టీవీ షోలు చేస్తూనే మరో వైపున వెండితెరపైన మెరుస్తున్నాడు. యూట్యూబ్ చానల్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు. అలా సుమారుగా నెలకు రూ.50 వేల వరకు దుర్గారావు దంపతులు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news