రజనీకాంత్, కృష్ణ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమాలివే..

-

ఇటీవల కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR..బాక్సాఫీసు రికార్డులన్నిటినీ తిరగరాసింది. ఇద్దరు సూపర్ స్టార్స్ రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఈ పిక్చర్..ప్రేక్షకుల విశేష ఆదరణకు నోచుకుంది. కాగా, అప్పట్లోనే ఇద్దరు సూపర్ స్టార్స్ ..రజనీకాంత్, కృష్ణ కలిసి నటించారు. ఆ సినిమాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ స్టార్ కృష్ణ..ఇద్దరిని వెండితెర మీద చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..బాగుంటుంది కదా..ముఖ్యంగా అభిమానులు అయితే వీరి నటనను చూసి ఫిదా అవాల్సిందే. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘అన్నదమ్ముల సవాల్’.

1978లో తొలిసారి వీరు కలిసి నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్..లో రజనీకాంత్, కృష్ణ కలిసి నటించగా, జనం చప్పట్లు కొట్టారు. ఈ సూపర్ హిట్ కాంబోను డైరెక్టర్ దాస్ మళ్లీ రిపీట్ చేశారు.

రజనీకాంత్, కృష్ణతో తర్వాత ‘ఇద్దరు అసాధ్యులే’ అనే సినిమా తీశారు. అయితే, ఈ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, కమర్షియల్ గా డబ్బులు అయితే వచ్చాయి. ఇక ఆ తర్వాత కృష్ణ, రజనీకాంత్..‘రామ్..రాబర్ట్..రహీం’ సినిమా కోసం కలిసి పని చేశారు. ఈ పిక్చర్..బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్..‘అమర్..అక్బర్..ఆంటోనీ’కి తెలుగు రీమేక్. ఒరిజినల్ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news