మహారాష్ట్రపై బీజేపీ ఫోకస్.. ఢిల్లీకి వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్!

-

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన ఈ సంక్షోభం.. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత బలపడింది. పదుల సంఖ్యలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో సీఎం ఉద్దవ్ ఠాక్రేకు టెన్షన్ మొదలైంది. ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ కావులు కదుపుతోంది. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు నమ్మినబంటుగా ఉన్న మంత్రి ఏకనాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లినట్లు సమాచారం.

ఉద్దవ్ ఠాక్రే-దేవేంద్ర ఫడ్నవీస్
దేవేంద్ర ఫడ్నవీస్-ఉద్దవ్ ఠాక్రే

శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరుగుతుందనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి హుటాహుటిగా చేరుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డాతో అమిత్ షా భేటీ అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాగా, మరొవైపు మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news