ప్రముఖ మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక తండ్రికి తగ్గట్టుగానే తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇటీవల తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైన సీతారామం సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో నటించిన దుల్కర్ సల్మాన్ అలాగే మృనాల్ ఠాకూర్ , రష్మిక మందన్న అందరికీ కూడా మంచి పేరు లభించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హను రాఘవపూడి పై కూడా ప్రేక్షకులలో మంచి అభిప్రాయం కలగడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా దుల్కర్ సల్మాన్ ఆస్తి విలువ ఎంత అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది.ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనాల ప్రకారం దుల్కర్ సల్మాన్ ఆస్తి విలువ సుమారుగా రూ.400 కోట్ల పై మాటే అన్నట్లు సమాచారం. ఇక అత్యంత విలాసవంతమైన భవనం కూడా ఈయన దగ్గర ఉంది. సుమారుగా దాని విలువ 100 కోట్ల రూపాయలు. ఇక అంతేకాదు ఈయన మిగతా సంపదను ఇతర రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దుబాయ్ వంటి మహా నగరాలలో కూడా 14 కోట్ల రూపాయల విలువ చేసే పెంట్ హౌస్ కూడా దుల్కర్ సల్మాన్ కు సొంతమట. ఇక రూ.20 కోట్లకు పైగా విలువచేసే కార్ల కలెక్షన్లు ఈయన దగ్గర ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా మెర్సిడేస్ బెంజ్ ,ఫరారి, బీఎండబ్ల్యూ వంటి అత్యంత ఖరీదైన కార్లు దుల్కర్ సల్మాన్ కార్ గ్యారేజ్ లో ఉంటాయి.ఒక్కొక్క సినిమాకు 8కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే దుల్కర్ సల్మాన్.. ఒక్కో యాడ్ కు 60 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఇక అంతే కాదు కూతురు , భార్య పేరు పైన కూడా కొన్ని స్థిరాస్తులు కూడ పెట్టినట్లు సమాచారం.