ఎఫ్3 మూవీ రివ్యూ: అనిల్ మార్క్ సినిమాకు హైలెట్ అయ్యింది..పబ్లిక్ టాక్ ఇదే..

-

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, తమన్నా, మెహరీన్, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్ తదితరులు.

దర్శకత్వం : అనిల్‌ రావిపూడి

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

స్క్రీన్ ప్లే : అనిల్‌ రావిపూడి

ఎడిటర్ : తమ్మిరాజు

గతంలో వచ్చిన ఎఫ్2 ఏ మాత్రం హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఆ సంవత్సరానికి హిట్ అయిన సోలో మూవీ అని చెప్పవచ్చు.. కథ ఆద్యంతం నవ్వులు పూయించింది.భార్యా బాధితుడు ఎలా చేస్తాడు..తన ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు అనే అంశం మీద సినిమా కథ ఉంటుంది.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వచ్చింది. అదే ఎఫ్3.. ఆ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఆలస్యం ఎందుకు సినిమా కథ,సినిమా ఎలా ఉందో, పబ్లిక్ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..

కథ..

లోకంలో పంచభూతాలతో పాటు మరో భూతం ఉంది.. అదే డబ్బు అనే కోణంలో ఈ కథ మొదలైంది. వెంకీ(వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్) .. డబ్బు, బంగారం అంటే ఆశ పడే భార్యలకు భర్తలుగా కనిపించారు. బాగా డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడే వీరికి, లోపాలు కూడా ఉంటాయి. వెంకీకి రేచీకటి ఉంటే, వరుణ్ కి నత్తి ఉంటుంది. మరి తమ లోపాలను కవర్ చేస్తూ.. డబ్బు సంపాదన కోసం వీళ్లు ఏమి చేశారు ? ఈ ప్రాసెస్ లో తమన్నా, మెహరీన్ వీరికి ఎలాంటి సమస్యలు సృష్టించారు ? ఈ మధ్యలో సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ఏమిటి ? చివరకు వెంకీ – వరుణ్ ఏమి సాధించారు ? అనేది మిగిలిన కథ..

పూర్తీ విశ్లేషణ..

అనిల్ రావిపూడి తన డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అండ్ క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాడు. అలాగే క్వాలిటీ ఫన్ తో ఫుల్ గా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాల్లో వచ్చే సీన్స్ లో అయితే, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశాడు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెంకీ -వరుణ్ ల లోపాలను కూడా చాలా ఫన్నీగా ఎలివేట్ చేశాడు. హీరోలు కూడా, ముఖ్యంగా వెంకటేష్ ‘వెంకీ పాత్ర’లో లీనం అయిపోయాడు..మొత్తానికి వెంకీ తన మార్క్ ను చూపించాడు..

వరుణ్ తేజ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి రైటింగ్ టేబుల్‌ దగ్గరే స్క్రిప్ట్ ను బలంగా రాసుకున్నాడు. అదే స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు. డబ్బు కోసం ఇద్దరు ఫ్యామిలీ మ్యాన్స్ పడే ఇబ్బందుల పరిణామ క్రమాన్ని కూడా చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలో పాత్రలు, వాటి పరిచయం, కొన్ని కీలక సన్నివేశాలు సరదాగా సాగుతూ..సినిమాకు హైలెట్ అయ్యింది.కథ కొంచెం కొత్తగా ఉంది.మొదటి షో వరకూ మంచి టాక్ ను అందుకుంది.మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

రేటింగ్: 3/5

Read more RELATED
Recommended to you

Latest news