కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్

గత రాత్రి కవలపిల్లలకు జన్మనిచ్చారు ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విషయం తెలిసిన నెటిజన్లు, సెలబ్రిటీలు, చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 2014 లో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు చిన్మయి- రాహుల్. కాగా నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరించిన చిన్మయి తెలుగులో పలు పాటలు పాడారు.

బాయ్స్, శివాజీ, ఆరెంజ్, ఏ మాయ చేసావే, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరివాడేలే నుంచి ఇటీవల విడుదలైన మేజర్ వరకు ఎన్నో సినిమాల్లో ఆమె పాటలు పాడారు. కాగా చిన్మయి కవలలకు జన్మనిచ్చిన ఈ విషయాన్ని ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ..” తమ ప్రపంచంలోకి దీప్తి, శర్వస్ కొత్తగా వచ్చి చేరారని, వారు తమతోనే ఉండిపోయే అతిథులు అంటూ చిన్నారుల చేతులు పట్టుకున్న ఫోటోలను షేర్ చేశారు.కావలల్లో బాబు, పాప ఉన్నారు.