ప్రముఖ సింగర్ యశస్వి మోసాన్ని బయటపెట్టిన మహిళ..!

ఈమధ్య కాలంలో సింగర్స్ కూడా కొన్ని రియాల్టీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక సరిగమప సింగింగ్ షో ద్వారా ఒక రోజులోనే మంచి గుర్తింపు అందుకున్న సింగర్స్ లో యశస్వి కొండేపూడి కూడా ఒకరు. అతను కేవలం ఒకే ఒక పాటతో జనాలను తన వైపుకు తిప్పుకున్నాడు. జాను చిత్రంలోని లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ సింగర్ అయిపోయాడు. అయితే ఇప్పుడు అతనిపై కొన్ని విమర్శలు వస్తూ ఉండడం.. మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సరిగమప సింగర్ యశస్వి ఇప్పటికే చాలా రియాల్టీ షో లతో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి సంగీత కళాకారులు కావడంతో మూడు సంవత్సరాల వయసు నుంచే అతడు సింగర్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే మొదటిసారి అతనికి మాత్రం అనుకున్నంత స్థాయిలోనే గుర్తింపు లభించింది.. అది కూడా సరిగమప షో ద్వారా.. ఇక జాను సినిమాలో పాడిన తర్వాత తన కెరీర్లో వెను తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత పలు రియాల్టీ షోలలో కూడా అదే పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ తాజాగా ఒక ఎన్జీవో సంస్థను నడుపుతూ చాలామంది అనాధ పిల్లలు బాగోగులు చూసుకుంటున్నట్లు యశస్వి చెబుతున్నాడు. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అంటూ కాకినాడకు చెందిన ఎన్జీవో మహిళ ఊహించని విధంగా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. కాకినాడ నవసేన ఫౌండేషన్ తనది అంటూ చెప్పుకుంటున్న సింగర్ యశస్వి చెప్పిన మాటలలో ఏమాత్రం నిజం లేదు.. ఆ సంస్థ ప్రతినిధి ఫరా కౌసర్. యశస్వి మమ్మల్ని మోసం చేశారు.. గత ఐదేళ్లుగా తన సొంత డబ్బుతోనే 50 మందికి పైగా పిల్లలు పోషిస్తున్నట్లు, చదివిస్తున్నట్లు తెలిపాడు ఇందులో యశస్వి కి ఏ విధమైన సంబంధం లేదు. ఏ సెలబ్రిటీ కూడా మా సంస్థకు సహాయం చేయలేదు అని ఫరా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.