అరవింద సమేత ఫైట్ సీన్ లీక్

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న అరవింద సమేత సినిమా నుండి ఇప్పటికే లీకు బారిన పడిన సంగతి తెలిసిందే. సినిమా నుండి కొన్ని సీన్స్ ఇప్పటికే లీక్ అవగా తాజాగా అరవింద సమేత నుండి ఓ ఫైట్ సీన్ లీక్ అయ్యింది. ఏకంగా రెండున్నర నిమిషాలు కలిగిన ఈ ఫైట్ సీన్ లీక్ అవడం చిత్రయూనిట్ ను ఆందోళనకు గురి చేస్తుంది.

గ్రాఫిక్స్ వర్క్ కోసం పంపించిన 20 నిమిషాల ఫుటేజ్ నుండి ఈ రెండు నిమిషాల సీన్ లీక్ అయినట్టు తెలుస్తుంది. సినిమాకు హైలెట్ గా నిలిచే ఈ ఫైట్ సీన్ ముందే లీక్ అవడం పట్ల త్రివిక్రం చాలా నిరుత్సాహంగా ఉన్నాడట. ఎన్.టి.ఆర్ కూడా ఈ లీకుల గురించి తెలుసి బాధపడుతున్నాడట. అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఆ డేట్ న రావాలన్న తొందరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడప్ చేసింది. ఈ క్రమంలో లీకుల బారిన పడేలా చేసుకున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news