అరవింద సమేతలో పూజా బికిని రచ్చ

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేని పూజా హెగ్దె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది.

ఆ సినిమాలో అమ్మడి బికిని క్రేజీగా మారింది. అప్పటి నుండి పూజాకు లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్న పూజా మరోసారి తన ఫ్యాన్స్ కు బికిని ట్రీట్ అందించాలని చూస్తుంది. దసరాకి రానున్న అరవింద సమేత సినిమాలో పూజా టూ పీస్ బికినితో అలరిస్తుందట.

సినిమా నుండి వస్తున్న ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రకారం డిజే తర్వాత పూజా బికిని లుక్ లో అదరగొడుతుందని అంటున్నారు. మరి అరవింద సమేతలో పూజా అందాలు ఎలా ఉన్నాయో చూడాలంటే అక్టోబర్ 11 దాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news