రిలీజ్‌ సినిమా టిక్కెట్లు ఫ్రీ.. ఫ్రీగా చూసేయండి.. భలే చాన్స్..!

-

ఏదైనా సినిమా రిలీజ్ రోజు చూడాలంటే.. కష్టమే.. టికెట్లు ముందుగానే అయిపోతాయి. ఒక్కోసారి బ్లాక్ లో కూడా టికెట్లు కొనాల్సి రావచ్చు. కానీ ఇప్పుడు ఓ సినిమా మాత్రం రిలీజ్ రోజే సింపుల్ గా చూసేయొచ్చు. అది కూడా ఫ్రీగా.. పైసా ఖర్చు లేకుండా.. అందేంటి సినిమా ఫ్రీ ఏంటి అనుకుంటున్నారా.. అదే విచిత్రం.

ఇప్పుడు అంతా మార్కెటింగ్ యుగం. దేన్నయినా ప్రమోట్ చేసుకోవాలంటే సులభంగా లభించేది ఈ ఫ్రీ మంత్రం. ఇప్పటి వరకూ అనేక ఆఫర్లు చూశాం. కానీ ఇలా సినిమా ఫ్రీగా చూసే ఆఫర్ మాత్రం ఇదే తొలిసారి. తెలుగులో బీచ్‌రోడ్‌ చేతన్‌ అనే సినిమా ఈనెల 22న విడుదలవుతోంది. ఈ సినిమా మార్నింగ్ షోను ఉచితంగా చూపిస్తారు.

ఒక సినిమా తీశాక ప్రేక్షకులు చూసి బాగుందనో, బాగోలేదనో చెప్పాలి. కానీ ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతేనే సమస్య అంటున్నారు ఈ సినిమా హీరో. ఇందులో ఏముందనే ఒక ఆసక్తి మా సినిమాపై కలగాలనే తొలి రోజు తొలి ఆటని ఉచితంగా చూపిస్తున్నామంటున్నారు ఈ సినిమా హీరో చేతన్‌ మద్దినేని. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా.

ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడానికీ, వాళ్లకి ఈ సినిమా గురించి తెలియాలనే ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. ఆన్‌లైన్‌లో కాకుండా, థియేటర్‌కి వచ్చి టికెట్టు తీసుకోవాలి. మల్టీప్లెక్స్‌ల్లో చూసేందుకు అప్పటికే టికెట్టు కొన్నవాళ్లు, దాన్ని తీసుకొని థియేటర్‌కి వస్తే అక్కడున్న మా ప్రతినిధి డబ్బుని వాపస్‌ ఇస్తారని చెబుతున్నారు. చేతన్‌ మద్దినేని. ఈ ఆఫర్ ఏదో బాగానే ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news