నాటు నాటు పాటపై గరికపాటి వైరల్ కామెంట్స్…

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరికొకరు పోటీపడి నటించారు. ముఖ్యంగా ఇందులో నాటు నాటు పాటలో వీరిద్దరి డాన్స్ అద్భుతమైనే చెప్పాలి. పోటాపోటీగా డాన్స్ చేసి ప్రేక్షకుల్ని కళ్ళు తిప్పుకోకుండా చేశారు. ఈ పాటలో వీరిద్దరు పెర్ఫార్మెన్స్ కి ఇప్పటికే ఎన్నో ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గరికపాటి నరసింహారావు గారు ఈ పాటలో వీరిద్దరి డాన్స్ పై వైరల్ కామెంట్స్ చేశారు.

Venkatesh to step into Dhanush's shoes in Asuran remake "Telugu Movies ...

అర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకు తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సైతం దక్కింది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే ఏడాది అవుతున్న ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈనెల 13వ తేదీన 95వ అకాడమీ అవార్డులను ప్రకటించనున్న నేపథ్యంలో భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో గరికపాటి ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్సులను ప్రశంసిస్తూ అభినందనల వర్షం కురిపించారు.

నాటు నాటు పాట గురించి గరికపాటి మాట్లాడుతూ.. ”అచ్చ తెలుగులో రాసిన ఈ పాట ఆస్కార్‌కు నామినేట్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటన,కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్‌ అద్భుత రచన కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. గుడికి వెళ్తే ఆస్కార్‌ పురస్కారం రావాలని దండం పెట్టండి.ఇక నాటునాటులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల నటన అద్భుతం.. నాటు నాటు పాటలో ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు. కవలలై పుట్టినవారికి కూడా ఇది సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు వీరిద్దరూ. అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను.. అంటూ వీరిద్దరిని ప్రశంసలతో ముంచేస్తారు.