కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భారతీయుడు 2’ అప్‌డేట్..

-

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ చిత్రం కోసం అభిమానులే కాదు సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ షూటింగ్ టైమ్ లో జరిగిన ప్రమాదం, దర్శకుడికి నిర్మాతకు మధ్య విభేదాల వలన షూట్ ఆగిపోయింది. శంకర్ తదుపరి చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో అక్కడే ఆగిపోయింది.

‘విక్రమ్’ మూవీతో ఘన విజయం అందుకున్న కమల్ హాసన్.. ‘ఇండియన్ 2’ పిక్చర్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. దర్శకుడు శంకర్ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉన్నందున కొంత డిలే అయిందన్నారు. కాగా, తాజాగా ఈ పిక్చర్ అప్ డేట్ ఇచ్చేసింది అందాల చందమామ కాజల్ అగర్వాల్.

ప్రెగ్నెన్సీ వలన కొంత కాలం మూవీ షూటింగ్స్ కు దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్..త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ మేరకు ప్రకటించింది. వచ్చే నెల (సెప్టెంబర్) 13 నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని పేర్కొంది. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘భారతీయుడు -2’పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ అయిన క్రమంలోనే ఆయన ‘ఇండియన్-2’పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘ఇండియన్-2’ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సుముద్ర ఖని, బాబీ సింహా, సుకన్య, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘భారతీయుడి’గా కమల్ హాసన్ గెటప్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news