బ్యాచిలర్ పార్టీలో కూడా అందాల వలకపోస్తున్న హన్సిక..!!

టాలీవుడ్ లోకి దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకుంది. మొదట చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించిన హన్సిక బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించింది. దేశముదురు చిత్రంతో మంచి పాపులారిటీ తెచ్చుకోవడంతో ఎంతోమంది హీరోల సరసన నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. అలా కోలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.


హన్సిక పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మంచి విజయాలను అందుకుంది. తనే నిర్మాతగా కొన్ని చిత్రాలకు కూడా వ్యవహరించింది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి హన్సిక వివాహ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఒక బిజినెస్ మ్యాన్ అయినా సోహైల్ ని వివాహం చేసుకోబోతుందని వార్తలు వినిపించాయి. అందుకుగాను వచ్చే నెల నాలుగవ తేదీన రాజస్థాన్ లో హన్సిక వివాహం అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. వాటితోపాటు తను చేసుకోబోయే తన పార్టనర్ స్నేహితుడు తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

హన్సిక వివాహానికి కావాల్సిన పలు ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా హన్సిక తన స్నేహితులకు ఒక బ్యాచులర్ పార్టీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ బ్యాచిలర్ పార్టీలో హన్సిక వేసుకున్న దుస్తులు అందర్నీ ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. వివాహానికి ముందు బ్యాచిలర్గా చివరిసారి చేసుకుంటూ ఈ పార్టీ కోసం మంచిగా గ్లామర్ గా తయారైనట్లుగా కనిపిస్తోంది.

హన్సిక తో పాటు తన స్నేహితుడు కూడా అంతే అందంగా రెడీ అయినట్లుగా ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. మరి వివాహం తర్వాత హన్సిక సినిమాలలో నటిస్తుందా లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి .

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)