Happy Birthday Moive : ఓటీటి లో లావణ్య “హ్యాపీ బర్త్ డే”

-

‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సొట్టబుగ్గల సోయగం అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా చేసింది లావణ్య త్రిపాఠి.

యాక్షన్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ పిక్చర్ లో నరేశ్ అగస్త్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇటీవలే ఈ సినిమా విడుదల మంచి టాక్‌ నే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ ‘‘హ్యాపీ బర్త్ డే’’ పిక్చర్ అప్ డేట్ ఇచ్చేశారు. ఈ నెల 8 వ తేదీన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నెట్‌ ఫ్లిక్స్‌ లో సినిమాను ఆగస్ట్‌ 8 నుంచి రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news