RRR మూవీకి మరో నాలుగు ప్రతిష్ఠాత్మక అవార్డులు

-

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్​లో తన హవా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల్లో తన సత్తా చాటింది. బెస్ట్​ యాక్షన్​ ఫిల్మ్​, బెస్ట్​ ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​, బెస్ట్​ ఒరిజినల్ సాంగ్​తోపాటు స్టంట్​ విభాగాల్లో ఆర్​ఆర్​ఆర్​ అవార్డులను కైవసం చేసుకుంది.

బెస్ట్​ యాక్షన్​ ఫిల్మ్​ క్యాటగిరీలో టాప్​ గన్​, బ్యాట్​మాన్​ వకండా ఫరెవర్​ లాంటి హాలీవుడ్​ బిగ్గెస్ట్​ ఫిల్మ్​ను దాటేసి ఆర్​ఆర్​ఆర్​ ఆవార్డును దక్కించుకోవడం గమనార్హం. బెస్ట్​ స్టంట్స్​ క్యాటగిరీలో ఈ సినిమాకే అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో నాటు నాటు పాట కూడా అవార్డును గెలుచుకుంది. బెస్ట్​ ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ విభాగంలో పలు దేశాల సినిమాలతో పోటీపడి ఆర్​ఆర్​ఆర్​ అవార్డు అందుకుంది. ఈ హాలీవుడ్​ క్రిటిక్స్​ అసోసియేషన్​ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో హీరో రామ్​చరణ్​, రాజమౌళి, కీరవాణితో పాటు ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ మొత్తం పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news