దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ ను విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం తమ పార్టీ విధివిధానాలపై వివిధ భాషల్లో పాటలు రాయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హిందీ, మరాఠీ, కన్నడ, ఒరియా భాషల్లో పాటల రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది.
ఇక అన్ని రాష్ట్రాల్లో పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు సొంత పత్రికలు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారట. కాగా, బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల గురువారం రోజున బీఆర్ఎస్లో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రి, పలువురు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.