కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) నూతన డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ను నియమించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటిరోజే ఆయనను సిబిఐ డైరెక్టర్ గా ఎంపిక చేయడం గమనార్హం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ టాప్ పోలీస్ ఆఫీసర్ రెండేళ్ల వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక డిజిపి గా ఉన్నారు.
ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఈయన పేరును ఖరారు చేసింది. సిబిఐ డైరెక్టర్ గా ఉన్న సుబోత్ కుమార్ జైస్వాల్ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన నుంచి సూద్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుభోత్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం మే 25 తో ముగుస్తుంది. అనంతరం సూద్ బాధ్యతలు చేపట్టనున్నారు.