సమంత కాపురంలో నిప్పులు పోస్తున్న హీరోయిన్

-

అక్కినేని నాగ చైతన్య సమంతలు ఆన్ స్క్రీన్ జంట మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇద్దరు జీవితాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతు, సమంతలు కలిసి చేస్తున్న సినిమా మజిలి. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చైతు, సమంతలు భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ల మధ్యలో గొడవలవుతాయట.

ఆ గొడవలకు ఓ అమ్మాయి కారణం అవుతుందట. ఈ సినిమాలో చైతు, సమంతల మధ్య చిచ్చు పెట్టే పాత్రలో మోడలింగ్ నుండి హీరోయిన్ గా పరిచయమవుతున్న దివ్యాన్ష్ కౌశిక్ నటిస్తుంది. తెలుగులో మొదటి ఛాన్స్ మజిలి రావడం గొప్ప విషయమే అని చెప్పాలి. చైతు, సమంతలు కూడా పెళ్లి తర్వాత చేస్తున్న ఈ మజిలిపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ చేస్తున్న ఈ మజిలి ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.

నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష్ కౌశిక్ ముగ్గురు మధ్యలో జరిగే కథే మజిలి సినిమా. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను కోనా వెంకట్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news