HHVM Review : ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ.. హిట్ పడినట్టేనా

-

HHVM Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా నిన్న రాత్రి నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. కాగా ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా అభిమానులు ఈ సినిమా చూడడం కోసం తరలి వెళ్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే….

కథ మరియు వివరణ:

వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఒక దొంగ. రాబిన్హుడ్ తరహాలో పెద్దవాళ్ళను కొట్టి పేద వాళ్లకు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో వీరమల్లుకు ఒక దొర (సచిన్ ఖేడ్కర్) నుంచి పిలుపు వస్తుంది. అక్కడే పంచమి (నిధి అగర్వాల్)ను చూసి వీరమల్లు ప్రేమలో పడతాడు. తనను దొరల చర నుంచి తప్పించాలి అంటూ పంచమి వీరమల్లును కోరడంతో అతను ఒప్పుకుంటాడు. అదే సమయంలో కుతుబ్షాహీల నుంచి వీరమల్లుకు పిలుపు వస్తుంది. ఎర్రకోటలో నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకురావాలి అంటూ కుతుబ్షాహీ ప్రభువు వీరమల్లును రిక్వెస్ట్ చేస్తాడు.

ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడు అయిన ఔరంగజేబు బాబి డియోల్ కూర్చొని ఉంటాడు. మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అంటూ హిందువులను తరచూ హింసిస్తుంటాడు. అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోహినూర్ వజ్రం కోసం తన దండుతో ఢిల్లీకి బయలుదేరుతాడు వీరమల్లు. ఆ తర్వాత ఆ వజ్రం కోసం వీరమల్లు చేరుకున్నాడా లేదా అనేది అసలు కథ. చివర్లో యుద్ధ భూమి అనే పేరుతో అసలైన యుద్ధం గురించి తెలుసుకోవాలంటే పార్ట్-2 సినిమా చూడాలని చెబుతారు దీంతో సెకండ్ పార్ట్ పై ఆసక్తిని పెంచేశారు.

పాజిటివ్ పాయింట్స్

  • పోర్టు ఫైట్
  • మైండ్ బ్లోయింగ్ ప్రీ క్లైమాక్స్
  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
  • బ్యాక్ గ్రౌండ్ సాంగ్
  • కొల్లగొట్టి నాదిరో సాంగ్

మైనస్ పాయింట్స్

  • కథ సాగదీత
  • కొన్ని బోరింగ్ సీన్స్

రేటింగ్: 3/5

Read more RELATED
Recommended to you

Latest news