అల్లు అర్జున్ వివాదంలో తెలంగాణ పోలీసులకు షాక్ తగిలింది. అల్లు అర్జున్ వివాదంలో రంగంలోకి మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. సంధ్య థియేటర్ ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ పోలీసులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
పోలీసుల లాఠీఛార్జ్ వల్లే రేవతి చనిపోయిందని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు న్యాయవాది రామరావు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరపాలని కోరింది మానవ హక్కుల కమిషన్. లాఠీఛార్జ్ పై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన NHRC.. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. మరి దీనిపై తెలంగాణ పోలీసులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాల్సి ఉంది. అటు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అల్లు అర్జున్ కాస్త ఊరట లభించింది.