వాటి నుండి ఎన్నో నేర్చుకుని ముందుకు సాగడమే జీవితం : మెగా డాటర్ సుస్మిత…..!!

-

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన కం బ్యాక్ మూవీ అయిన 150వ సినిమా, ఖైదీ నెంబర్ 150 మూవీలో ఆయన మునుపటిటా ఎంతో యంగ్‌గా, అందంగా కనపడ్డారు. అయితే ఆయన అంత యంగ్‌గా కనపడటానికి ఆయన ధరించిన కాస్ట్యూమ్స్ కూడా కొంతవరకు కారణం అనే చెప్పాలి. కాగా ఆ కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసింది స్వయానా ఆయన పెద్ద కూతరు సుస్మిత. కొన్నాళ్ల క్రితం విష్ణుప్రసాద్‌ను వివాహమాడిన సుస్మిత, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో దూసుకెళ్తున్నారు.

ఆ తరువాత మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం జరిగింది. ఇకపోతే నేడు ఆమె ‘ప్రోవోగ్‌’ అనే జాతీయ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొనడంతో పాటు వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను జీవితంలో ఇంత మంచి పేరు సంపాదించడానికి తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, ముఖ్యంగా తండ్రి చిరంజీవి, మమ్మల్ని మా అభిరుచుల మేరకు పెంచారని, అలానే వ్యక్తిగతంగా ఎవరికి వారు కష్టపడితేనే జీవితంలో వృద్ధిలోకి రాగలం అని తన తండ్రి ఎప్పుడూ చెప్తుంటారని, ఆయన మాటలే తమకు ఎప్పుడూ ఆదర్శం అని ఆమె అన్నారు. ఇక తనకు నటనపై పెద్దగా ఆసక్తి లేదని, అందుకే చదువుల అనంతరం కాస్ట్యూమ్ డిజైనర్ గా మారాలని అనుకున్నట్లు ఆమె చెప్పారు.

 

ఎవరికైనా జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయని, అయితే వాటి నుండి ఎంతో కొంత నేర్చుకుని ముందుకు సాగితే మున్ముందు విజయం తథ్యం అని ఆమె అన్నారు. అలానే ఎప్పుడూ జరిగిపోయిన తప్పులను మాత్రం పదే పదే గుర్తుచేసుకోవడం చేయకూడదని, దానికి బదులు మనం అనుకున్న లక్ష్యం పై దృష్టిపెడితే తప్పకుండా అభివృద్ధితో ముందుకు సాగవచ్చని ఆమె అన్నారు. ఇక సుస్మిత  ఫొటోలతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ  ఈ మ్యాగజైన్‌ ప్రత్యేక సంచిక ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news