మేకింగ్‌లోనే రికార్డు..మహేశ్ బాబు ‘ఒక్కడు’ షూటింగ్ విశేషాలివే..!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఒక్కడు’ ఆయన కెరీర్ లోనే బెస్ట్ పిక్చర్ అని చెప్పొచ్చు. సినీ లవర్స్, మహేశ్ అభిమానులు ఈ మూవీ చూసి ఫిదా అయిపోయారు. మహేశ్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదల తర్వాతనే కాదు మేకింగ్ నుంచే రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ చిత్ర షూటింగ్ విశేషాలు తెలుసుకుందాం.

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ ఫిల్మ్ కోసం భారీ సెట్స్ వేశారు. ఆ సెట్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ పిక్చర్ లో కనిపించే చార్మినార్ సెట్ కోసం దాదాపు రూ.2 కోట్లకు పైగానే డబ్బులు ఖర్చు చేశారు. అలా సినిమా కోసం సెట్ వేసిన తర్వాత.. ఆ సెట్..‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కడం విశేషం.

‘ఒక్కడు’ సినిమా కథ చార్మినార్ ప్రాంతానికి చెందిన అబ్బాయితో స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి పాత్రను మహేశ్ పోషించగా, రియలిస్టిక్ గా ఉండటం కోసం సెట్ వేశారు మేకర్స్. అశోక్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. చార్మినార్ పైన రియల్ గా షూట్ చేయడానికి అనుమతులు లేవు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం సెట్స్ వేయాల్సి వచ్చింది.

హైదరాబాద్ సిటీ శివారులోని గోపన్నపల్లె గ్రామంలో ప్రొడ్యూసర్ రామానాయుడుకు చెందిన పదెకరాల భూమిలో చార్మినార్ సెట్ వేశారు. మూడొందల మందికిపైగా కార్మికులు దాదాపు మూడు నెలల పాటు కష్టపడి సెట్ వేశారు.

మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువనే అయిందట. రూ.15 కోట్ల వరకు బడ్జెట్ కాగా, రిలీజ్ తర్వాత ప్రొడ్యూసర్ కు మంచి లాభాలు వచ్చాయి. ఇక సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. మహేశ్ ప్రస్తుతం..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news