ప‌వ‌న్ భారీ రెమ్యునరేషన్‌.. ఇంట్ర‌స్టింగ్ టాక్‌..!

-

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమ‌ల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ప్లాప్ అయినా సినిమాల్లో మాత్రం మామూలు క్రేజ్ లేదు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ ఎంత ఉండొచ్చ‌న్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. అజ్ఞాతవాసి సినిమాకి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ భారీ రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు అప్పట్లో ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌టికి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అదే టాప్ రెమ్యున‌రేష‌న్‌.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తాజా లెక్కల ప్రకారం టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ పొందుతోన్న హీరో మహేష్‌బాబు అంటున్నా అందులో వాస్త‌వ అవాస్త‌వాలు బ‌య‌ట‌కు రావు. ఇక చిరు త‌న తాజా సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి కోసం రెమ్యున‌రేష‌న్ విష‌యంలో పాత లెక్క‌లు చెరిపేశార‌నే అంటున్నారు. అయితే ఈ సినిమాకు చిరు రెమ్యున‌రేష‌న్ తీసుకోలేద‌నే వారు కూడా ఉన్నారు.

ప‌వ‌న్ భారీ రెమ్యునరేషన్‌.. ఇంట్ర‌స్టింగ్ టాక్‌..!
ప‌వ‌న్ భారీ రెమ్యునరేషన్‌.. ఇంట్ర‌స్టింగ్ టాక్‌..!

మరోపక్క రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ కూడా కెరీర్‌లో అత్యధిక పారితోషికాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అందుకుంటున్నారని ఓ టాక్ ఉంది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ రీ ఎంట్రీతో చేసే కొత్త సినిమా కోసం ఏకంగా రు. 50 కోట్లు అడిగిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. ఇక చ‌ర‌ణ్ సైతం ప‌వ‌న్ తిరిగి సినిమాల్లో న‌టించ‌నున్నార‌ని చెప్ప‌డంతో ప‌వ‌న్ కొత్త సినిమాల‌పై ఇంట్ర‌స్టింగ్ వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌వ‌న్ కొత్త సినిమా విష‌యంలో చాలా గాసిప్స్ వ‌స్తున్నా క్రిష్ క‌థ‌కే ప‌వ‌న్ ఓకే చెప్పార‌న్న‌ది ఎక్క‌వుగా వినిపిస్తోన్న మాట‌. ఇక పవన్‌ అభిమానులే కాదు, జనసేన నేతలు కూడా పవన్‌ నుంచి ఓ సినిమా ఆశిస్తున్నారు. అది పార్టీకి సైతం ఉపయోగపడ్తుందన్నది మెజార్టీ వ‌ర్గాల అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news