ఓటీటీలో ‘ఇంటింటి రామాయణం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

ఈ మధ్య టాలీవుడ్​ సినిమాల్లో తెలంగాణ భాషకు, సంస్కృతికి పట్టం కడుతున్నారు దర్శకులు. తెలంగాణ సెంటిమెంట్​ను సినిమాల్లో చూపిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. తెలంగాణ మట్టి వాసన.. పల్లె సంస్కృతి.. భాష.. యాస.. ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. దీనికి ఉదాహరణలే ఇటీవల విడుదలై ప్రభంజనం సృష్టించిన సినిమాలు. అవే బలగం, దసరా. తెలంగాణ సెంటిమెంట్​ ఈ మధ్య నిర్మాతలకు కలిసి వస్తుండటంతో చిన్న సినిమాలు కూడా తీసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అలా ఖతర్నాక్ తెలంగాణ ఫ్యామిలీ డ్రామా అనే క్యాప్షన్​తో తెరకెక్కిన సినిమాయే ‘ఇంటింటి రామాయణం’.

- Advertisement -

రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో పలు సీరియల్స్‌లో కనిపించిన నవ్య స్వామి హీరోయిన్​గా అలరించింది. ఇక తెలంగాణ యాసలో తన ప్రత్యేకతను చాటుకున్న గంగవ్వ ఇందులో కీలకపాత్రలో నటించింది. మధ్యతరగతి కుటుంబాలలో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు సురేశ్‌ దర్శకుడు. ఇటీవల థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో జూన్‌ 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...