అభిజిత్ ని కాపాడడానికే నోయల్ అలా చేసాడా..?

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఐతే ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది. ఆరోగ్యం బాగాలేనందున నోయల్ హౌస్ నుండి బయటకి వెళ్ళాడు. సాధారణంగా హౌస్ నుండి బయటకి వెళ్ళే వారు ఇంట్లో ఉన్న సభ్యుల గురించి స్టేజి మీద మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ నోయల్ మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను బాధపడుతూంటే ఆ బాధ మీద జోకులేయడం ఎంత వరకు కరెక్ట్ అని అమ్మ రాజశేఖర్, అవినాష్ ని ప్రశ్నించాడు.

దీనికి అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు. కామెడీ చేస్తున్నారు మీరు జోకర్లా అని నోయల్ అడిగాడు. దానికి అవినాష్, కామెడీ చేయడానికి కాకపోతే నన్నెందుకు బిగ్ బాస్ కి పిలిచారని అన్నాడు. ఐతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దాని ప్రకారం అభిజిత్ ని కాపాడడానికే నోయల్ ఇలా చేసాడని మాట్లాడుకుంటున్నారు. అభిజిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలుసు.

అతనితో పోటాపోటీగా ఉన్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారంటే అది అవినాషే. అందుకే అవినాష్ పై అభిమానుల్లో ఒకరకమైన అభిప్రాయం క్రియేట్ చేయడానికే నోయల్ ఇలా మాట్లాడి ఉంటాడని అనుకుంటున్నారు. అనారోగ్య కారణాల వల్ల బయటకి వెళ్ళిన నోయల్, తన స్నేహితుడైన అభిజిత్ కి మేలు చేద్దామనే ఇలా చేసుంటాడని వినబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news