తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

-

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు బుల్లితెర ఆర్టిస్టులు ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే వేగంగా తల్లిదండ్రులవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పెళ్లయిన వెంటనే తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే దావలో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ కూడా నడుస్తున్నాడని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా తనకంటూ మంచి పేరు సంపాదించుకొని మరింత పాపులారిటీ దక్కించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఒకవైపు పలు షో లు చేస్తూనే తన భార్యతో కలిసి రియాల్టీ షోలు కూడా చేసిన అవినాష్ తాజాగా తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలో తాము పేరెంట్స్ గా ప్రమోషన్ పొందుతున్నామని ఈ మేరకు ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ యూట్యూబ్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ముక్కు అవినాష్ యూట్యూబ్లో నా భార్య అనూజ ప్రెగ్నెంట్.. మా పెళ్లి అయి ఏడాదిన్నర అవుతోంది.. అక్టోబర్లో మా పెళ్లి రోజు.. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని మమ్మల్ని ఎప్పటినుంచో చాలామంది అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాము. త్వరలోనే బాబు లేదా ఒక పాప మా ఇంటికి రాబోతోంది..

పెళ్లయిన ఏడాదిన్నరకే తల్లిదండ్రులు కావడం నిజంగా సంతోషంగా ఉంది. మూడు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. ఇప్పుడు నాలుగో నెల.. అందుకే ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు పెట్టాము.. మాకంటే కూడా మా అమ్మ నాన్న, అత్తమామలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.. నాలుగో నెలలో బేబీ గుండె చప్పుడు కూడా మేము విన్నాము.. అప్పుడు కలిగిన ఆనందాన్ని మేం మాటల్లో చెప్పలేకపోతున్నాము.. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు అవినాష్.

Read more RELATED
Recommended to you

Latest news