నయనతారపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్, అందంతోపాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకుంది. జాన్వీ కపూర్ తన తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది. అయితే, జాన్వి కపూర్ హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ గుడ్ లక్ జెర్రీ. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోకో కోకిల మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది గుడ్ లక్ జెర్రీ.

అయితే ఈ మూవీ సక్సెస్ గురించి ఇటీవల మీడియాతో జాన్వి కపూర్ మాట్లాడుతూ, మూవీ కోసం తనతో సహా టీం మొత్తం ఎంతో కష్టపడ్డాం అని, ఫైనల్ గా మూవీకి మంచి ఆదరణ లభిస్తుందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలానే జాన్వి మాట్లాడుతూ, ఈ మూవీపై లేడీ సూపర్ స్టార్ నయనతార పాజిటివ్ గా స్పందించారనే వార్త ఇటీవల తాను విన్నానన్నారు.

అనంతరం ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెకు సంతోషం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశాను. దానికి ఆమె రిప్లై ఇస్తూ, కెరీర్ బిగినింగ్ లోనే ఇటువంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఎంచుకున్నందుకు గర్విస్తున్నా, నీకు అభినందనలు అంటూ ఆమె పెట్టిన మెసేజ్ ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, అంతటి పేరున్న నటి నాకు ఈ విధంగా అభినందనలు తెలపడం అమిత ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news